ENTERTAINMENT

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను మార్చిన పుస్త‌కాలు

Share it with your family & friends

ప‌వ‌ర్ స్టార్ ఎంపిక చేసిన బుక్స్ ఇవే

హైద‌రాబాద్ – ప‌వ‌న్ క‌ళ్యాణ్ మంచి న‌టుడే కాదు. గొప్ప పుస్త‌కాల పురుగు కూడా. ఆయ‌న‌కు తెలుగు, ఇంగ్లీష్ సాహిత్యం అంటే విప‌రీత‌మైన అభిమానం. త‌ను ఎక్కువ‌గా క‌విత్వాన్ని, కోట్స్ ను ఇష్ట ప‌డ‌తారు. ప్ర‌ధానంగా గొప్ప గొప్ప క‌వులు, ర‌చ‌యిత‌లు , మేధావులు రాసిన పుస్త‌కాల‌ను విస్తృతంగా చ‌దువుతారు. ఏ మాత్రం స‌మ‌యం చిక్కితే చాలు పుస్త‌కాల‌లో లీన‌మై పోతారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

ల‌క్ష‌లాది మంది అభిమానుల‌ను క‌లిగిన న‌టుడు, రాజ‌కీయ నాయ‌కుడైన ప‌వ‌ర్ స్టార్ ను ప్ర‌భావితం చేసిన పుస్త‌కాలు ఏమిటో తెలుసు కోవాల‌ని ఉంటుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎక్కువ‌గా ఇష్ట ప‌డేది గుంటూరు శేషేంద్ర శ‌ర్మ రాసిన ఆధునిక మ‌హా భార‌తం, శ్రీ‌శ్రీ రాసిన మ‌హా ప్రస్థానం, త‌రిమ‌ల నాగి రెడ్డి రాసిన తాక‌ట్టులో భార‌త దేశం , జాషువా రాసిన గ‌బ్బిలం అంటే ఇష్టం.

వీటితో పాటు తొలిపొద్దు, దేవ‌ర‌కొండ బాల గంగాద‌ర్ తిల్ రాసిన అమృతం కురిసిన రాత్రి, వ‌న‌వాసి, ది సిటిజ‌న్ , ది నేష‌న్ , ది సీక్రెట్ నెట్ వ‌ర్క్ ఆఫ్ నేచ‌ర్ , గ‌డ్డి ప‌ర‌క‌తో విప్ల‌వం, శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు, సమ‌గ్ర ఆంధ్‌ర సాహిత్యం, పెద్ద బాల శిక్ష‌, తెలుగు వ్యాక‌ర‌ణం, ఖార వేలుడు ఉన్నాయి.