జనం గుండెల్లో జన సేనాని
పవన్ కళ్యాణ్ ప్రస్థానం
అమరావతి – పవన్ కళ్యాణ్ రేంజ్ వేరు. తన దారి వేరు. తన ఆలోచనలు వేరు. తన బాట వేరు. తనకు ముందు నుంచి ఏదో ఒకటి చేయాలన్న తపన. అందరి లాగా బతికితే ఏం లాభం. పది మందికి సేవ చేయాలన్న తపన లేక పోతే బతుక్కి ఏం అర్థం ఉంటుందని ఆవేదన పడ్డాడు పవర్ స్టార్.
లెక్కించ లేనంత మంది అభిమానులను కలిగిన అరుదైన నటుడు. తను చిటికె వేస్తే లక్షలాది మంది తరలి వచ్చేంత సత్తా కలిగిన యాక్టర్ గా గుర్తింపు పొందాడు. ఇదే సమయంలో తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి అడుగు జాడల్లో నడిచినా ఎందుకనో తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని కోరుకున్నాడు. ఆ దిశగా ప్రయత్నం చేశాడు.
మొదటగా మేధావులతో సమావేశం అయ్యాడు. ఆయన వెనుక ఉన్న ఏకైక శక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇదే క్రమంలో ఉన్నట్టుండి అవినీతి, అక్రమాలకు పాల్పడే వారి పట్ల జాగ్రత్తగా ఉండమని కోరాడు. ఇదే సమయంలో అనుకోకుండా జనం కోసం వారి హృదయాలలో ఉండేలా జనసేన పార్టీని ప్రకటించాడు పవన్ కళ్యాణ్.
ఎన్నికల సంఘంలో గుర్తింపు పొందింది. సామాన్యులు కోట్లాది మంది నిత్యం తాగే టీ గ్లాసు కావాలని కోరుకున్నాడు. అది ఆయనను వరించింది. ఇక ఆనాటి నుంచి నేటి దాకా వెనుదిరిగి చూడలేదు పవన్ కళ్యాణ్.
ఈ తరుణంలో చాలా మంది గేలి చేశారు తనను. కానీ వెను తిరిగి చూడలేదు. ముందుకే కదిలాడు. తానే ఆయుధమై కదిలాడు. పొలిటికల్ లీడర్ గా సక్సెస్ అయ్యాడు. పరిణతి చెందిన నాయకుడిగా గుర్తింపు పొందారు.