పవన్ కళ్యాణ్ అపర భక్తుడు
ఆంజనేయుడు..వారాహి అంటే పిచ్చి
హైదరాబాద్ – ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కు తెలంగాణలోని కొండగట్టులో వెలసిన ఆంజనేయ స్వామి అంటే అభిమానం. తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఆంజనేయ స్వామి భక్తుడు కావడం విశేషం.
తను ఏది కోరుకున్నా స్వామి వారు తీరుస్తారని నమ్ముతారు పవన్ కళ్యాణ్. తను వారాహి యాత్ర చేపట్టే ముందు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకున్నారు. అంతే కాదు వారాహి అమ్మ వారు అంటే కూడా ప్రేమ పవన్ కళ్యాణ్ కొణిదలకు.
తను నటించిన గబ్బర్ సింగ్ సినిమా రికార్డులను బద్దలు కొట్టింది. ఆ సమయంలో కూడా కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు పవన్ కళ్యాణ్. ఈసారి ఎన్నికల్లో విజయం సాధించాలని స్వామి వారిని కోరుకున్నారు .
స్వామి వారి దయతో తాను ఎన్నికల్లో గెలుపొందారు. అద్బుతమైన విజయం సాధించారు. ఏకంగా ఏపీకి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇదంతా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీర్వాదం వల్లనే వచ్చిందని భావిస్తారు.
పవన్ కళ్యాణ్ మంచి నటుడే కాదు గొప్ప మానవతా వాది అంతకు మించిన అపర భక్తుడు కూడా. ఆయనకు ఆ దేవుడు, అమ్మ వారి దయ ఎల్లప్పుడూ ఉండాలని ఆశిద్దాం.