అన్నంటే అభిమానం వదినంటే గౌరవం
ఇదీ పవన్ కళ్యాణ్ కు ఉన్న వ్యక్తిత్వం
అమరావతి – అన్ని బంధాల కంటే మానవ సంబంధాలు గొప్పవని నమ్మే వ్యక్తులలో పవన్ కళ్యాణ్ ముందంటారు. ఆయన వెరీ వెరీ స్పెషల్. ఎక్కువగా పుస్తకాలను, ప్రకృతిని ఇష్ట పడతారు. అంతకు మించి కొత్త కొత్త విషయాలను, అంశాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. ఏదో ఒకటి నేర్చుకోక పోతే బతుక్కి అర్థం ఉండదంటారు పవన్ కళ్యాణ్.
మెగాస్టార్ ఫ్యామిలీ అంటేనే బంధాలకు ఎక్కువ విలువ ఇస్తారు. అందరికంటే ఎక్కువగా స్వయం కృషితో పైకి వచ్చి మెగాస్టార్ గా స్థిర పడిన ..టాలీవుడ్ లో తనకంటూ ఓ స్టేటస్ సింబల్ ఏర్పాటు చేసుకున్న చిరంజీవి అంటే చచ్చేంత గౌరవం పవన్ కళ్యాణ్ కు.
తనకు అన్నయ్య కావడం తన పూర్వ జన్మ సుకృతమని ఒకానొక సందర్బంగా చెప్పాడు పవర్ స్టార్. తనకు తండ్రి లేని లోటును తీర్చిన అన్నయ్యంటే ప్రేమ. అదే సమయంలో తన కోసం ఎప్పుడూ ప్రేమగా వడ్డించి అన్నం పెట్టే వదినమ్మ సురేఖ అంటే భయం..భక్తి కూడా పవన్ కళ్యాణ్ కు. అందుకే ఉప ముఖ్యమంత్రిగా కొలువు తీరిన వెంటనే నేరుగా తన ఫ్యామిలీతో కలిసి అన్నా వదినెల పాదాలకు నమస్కరించాడు పవన్ కళ్యాణ్.
ఈ ఇద్దరి అన్నదమ్ముల ఆప్యాయతను, అనుబంధాన్ని చూసి ముచ్చట పడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.