పవర్ స్టార్ కు అతడంటే గురి
త్రివిక్రంతోనే చనువు ఎక్కువ
హైదరాబాద్ – సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ది ప్రత్యేకమైన స్థానం. ఇక దర్శకుల పరంగా చూస్తే మాటల మాంత్రికుడిగా పేరు పొందిన ఏకైక దర్శకుడు త్రివిక్రం శ్రీనివాస్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు కాసులు కురిపించాయి.
మాటలను తూటాల్లాగా పేల్చడంలో తనకు తనే సాటి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ . తన కలం ఒక్కసారి జూలు విదిలిస్తే గుండెల్ని మండించేలా చేయగల సత్తా ఉన్నోడు. తను అద్భుతమైన వక్త. సినిమాల్లోకి రాక ముందు అధ్యాపకుడిగా చేశాడు.
తను పవన్ తో తీసిన జల్సా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత మరో బ్లాక్ బస్టర్ మూవీగా మలిచేలా చేశాడు అత్తారింటికి దారేది మూవీలో. పవన్ కళ్యాణ్ పోషించిన పాత్ర సూపర్. అందులో సమంత హీరోయిన్.
పాటలు, మాటలు జనాన్ని కట్టి పడేసేలా చేశాయి. ఇక పవన్ కళ్యాణ్ కు పుస్తకాలు, సాహిత్యం అంటే ఇషట్ం. ఇవే అభిరుచులు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు కూడా. ఒక రకంగా పవన్ కళ్యాణ్ వెనుక ఉన్న ధైర్యం, భరోసా..ఆలోచనల వెను దర్శకుడు ఉంటారని ప్రచారం. ఏది ఏమైనా తన వెనుక ఉన్న అదృశ్య శక్తి..తన బలం..కలం పవన్ కళ్యాణ్ అంటూ ప్రతిసారి చెబుతూ వస్తాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.
వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వచ్చిందంటే చాలు అభిమానులకు పండగే. ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్..హరీశ్ శంకర్ తో ఓ సినిమా చేస్తుండగా ఇంకో సినిమా ఎప్పటికీ టైం దొరుకుతుందో వేచి చూడాలి.