ENTERTAINMENT

ప‌వ‌న్ గ‌బ్బ‌ర్ సింగ్ ఎవ‌ర్ గ్రీన్

Share it with your family & friends

సినీ కెరీర్ లో మైలు రాయి

హైద‌రాబాద్ – ప‌వ‌న్ క‌ళ్యాణ్ విల‌క్ష‌ణ న‌టుడు. త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న యాక్ట‌ర్ . అంతేకాదు డిఫ‌రెంట్ మేన‌రిజం, డైలాగ్ డెలివ‌రీతో ఓ ఊపు ఊపేశాడు. ల‌క్ష‌లాది అభిమానుల‌కు త‌న ప‌వ‌ర్ ఫుల్ యాక్టింగ్ తో క‌ట్టి ప‌డేశాడు.

ద‌మ్మున్న డైరెక్ట‌ర్ల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంటోడు దొరికితే ఇక పండ‌గే. అందుకే డైన‌మిక్ ద‌ర్శ‌కుడిగా పేరు పొందిన హ‌రీశ్ శంక‌ర్ కు త‌ను అదృష్టం రూపంలో ల‌భించాడు. ఇంకేం బాలీవుడ్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన స‌ల్మాన్ ఖాన్ న‌టించిన దబాంగ్ మూవీని రీ మేక్ తీయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాడు. ఇందుకు ప‌వ‌ర్ స్టార్ ఒప్పుకుంటాడో లేదోన‌ని భ‌య‌ప‌డ్డాడు హ‌రీశ్ శంక‌ర్.

మ‌నోడికి ముందే సాహిత్యం అంటే పిచ్చి. మాట‌ల‌ను తూటాల కంటే ప‌దునుగా వాడుకోవ‌డం తెలుసు. ఇంకేం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు లిట‌రేచ‌ర్ టేస్ట్ ఉంది. దీంతో క‌థ మొద‌లైంది. అదే గ‌బ్బ‌ర్ సింగ్ గా తెర మీద‌కు వ‌చ్చింది. బాక్సులు బ‌ద్ద‌లు కొట్టింది. బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ స‌క్సెస్ ఫుల్ మూవీగా రికార్డ్ బ్రేక్ చేసింది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌ట‌నలో డైన‌మిజం..ప‌వ‌ర్ ఫుల్ డైలాగులు..ద‌ర్శ‌కుడి దూకుడు..దేవిశ్రీ సంగీతం మ్యాజిక్ చేసింది. ఇంకేం బాక్సులు బ‌ద్ద‌ల‌య్యాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను చివ‌ర‌కు మా గ‌బ్బ‌ర్ సింగ్ త‌నేనంటూ పిలుచుకునేలా చేశాడు ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్.

త‌ను మ‌రో సారి ప‌వ‌న్ తో ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ తీస్తున్నాడు. ఇది కూడా బాక్సులు బ‌ద్ద‌లు కొట్టేందుకు సిద్దంగా ఉంది. మ‌రి ప‌వ‌ర్ స్టారా మ‌జాకా అంటున్నారు ఫ్యాన్స్.