హ్యాపీ బర్త్ డే ఉస్తాద్ భగత్ సింగ్
సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు
హైదరాబాద్ – ప్రముఖ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదల పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్బంగా సినీ, రాజకీయ, వ్యాపార, వాణిజ్య, సాహిత్య, కళా రంగాలకు చెందిన ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
డైనమిక్ దర్శకుడు హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి సంబంధించి పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్బంగా ఆసక్తికరమైన అప్ డేట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది చిత్ర నిర్మాణ సంస్థ. మరో వైపు ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన పవన్ కళ్యాణ్ అభిమానులు ఓ వైపు సంబురాలలో మునిగి పోయారు.
మరో వైపు వాయవ్య బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా ఇటు ఏపీలో అటు తెలంగాణలో ఎడ తెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం చోటు చేసుకుంది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
దీంతో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కేవలం ఇంటికే పరిమితం కానున్నట్లు సమాచారం. మరో వైపు వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టాలని తన అభిమానులు, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు జనసేనాని.