ENTERTAINMENT

ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌ల‌కాలం వ‌ర్దిల్లు

Share it with your family & friends

ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ బ‌ర్త్ డే విషెస్

హైద‌రాబాద్ – ప్ర‌ముఖ సినీ ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్ డే సంద‌ర్బంగా పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్రజల అశలకు, ఆశయాలకు , ఆయువు పోస్తూ ..అహర్నిశలు శ్రమిస్తున్న ..విల‌క్ష‌ణ న‌టుడు, ఏపీ డిప్యూటీ సీఎం ఆయురారోగ్యాల‌తో సుఖ సంతోషాల‌తో ఉండాల‌ని కోరారు.

ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా సోమవారం డైన‌మిక్ డైరెక్ట‌ర్ హ‌రీశ్ వంక‌ర్ స్పందించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక వ్య‌క్తి కాద‌ని ఆయ‌న ఓ శ‌క్తి ..ఓ వ్య‌వ‌స్థ అని స్ప‌ష్టం చేశారు .

ప‌వ‌ర్ స్టార్ తో క‌లిసి ప‌ని చేసే అవ‌కాశం ద‌క్క‌డం తాను మ‌రిచి పోలేన‌న్నారు. ప‌వ‌ర్ స్టార్ తో తీసిన గ‌బ్బ‌ర్ సింగ్ తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో మ‌రిచి పోలేని మూవీగా నిలిచి పోతుంద‌న్నారు.

రాబోయే రోజుల్లో విడుద‌లయ్యే ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ దుమ్ము రేప‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. ప‌వ‌ర్ స్టార్ స్టామినా ఏమిటో మ‌రోసారి ఈ చిత్రంలో చూపించే ప్ర‌య‌త్నం చేశాన‌ని పేర్కొన్నారు హ‌రీశ్ శంక‌ర్.