అందరి కళ్లు ఉస్తాద్ భగత్ సింగ్ పైనే
గబ్బర్ సింగ్ కంటే ఎక్కువ ఫోకస్
హైదరాబాద్ – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో అభిమానులు సంబురాలలో మునిగి పోయారు. ఇదే సమయంలో డైనమిక్ డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో బ్లాక్ బ్లస్టర్ మూవీగా రికార్డుల మోత మోగించిన గబ్బర్ సింగ్ మూవీని రీ రిలీజ్ చేశారు. మరోసారి బాక్సులను బద్దలు కొడుతోంది.
ఏళ్లు గడిచినా పవర్ స్టార్ మేనియా ఏ మాత్రం తగ్గలేదు అనేందుకు ఈ చిత్రం ప్రత్యక్ష ఉదాహరణ. ఇక హరీశ్ శంకర్ మరోసారి పవర్ స్టార్ ను సరికొత్తగా చూపించే ప్రయత్నం చేయబోతున్నాడు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో.
డిఫరెమంట్ మేనరిజం కలిగిన పవన్ కళ్యాణ్ ను మరింత శక్తివంతమైన రోల్ లో కనిపించేలా చేస్తున్నట్లు టాక్. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2016లో తమిళంలో విడుదలైన తేరి ఆధారంగా రీ మేక్ చేస్తున్నాడు డైరెక్టర్ .
ఈ తేరి సినిమాను తమిళంలో తీశాడు ప్రముఖ డైరెక్టర్ అట్లీ. మైత్రీ మూవీ మేకర్స్ దీనిని నిర్మిస్తుండడం విశేషం. ఇప్పటి వరకు ఉస్తాద్ భగత్ సింగ్ మరింత రిచ్ గా తీసేందుకు గాను ఏకంగా రూ. 150 కోట్లు ఖర్చు చేసినట్లు టాక్.
ఇక పవన్ కళ్యాణ్ తో పాటు ముద్దుగుమ్మ శ్రీలీలతో పాటు సాక్షి వైద్య నటిస్తున్నారు ఈ సినిమాలో. ఇక దేవీశ్రీ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేసేందుకు రెడీ అయ్యాడు. మొత్తంగా రాబోయే రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఏ మేరకు రికార్డుల మోత మోగిస్తాడో వేచి చూడాలి.