పవర్ స్టార్ రియల్ టార్చ్ బేరర్
సోషల్ మీడియాలో ట్రెండింగ్
హైదరాబాద్ – పవర్ స్టార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు ఇవాళ. తెలుగు వారందరికీ అత్యంత ఆత్మీయమైన వ్యక్తి. అంతకు మించి అభిమానులను కలిగిన విలక్షణ నటుడు. అంతర్ముఖుడు. సాహితీ ప్రియుడు. ఒక రకంగా చెప్పాలంటే గేయ రచయిత రాసినట్టు పవన్ కళ్యాణ్ ఆరడుగుల బుల్లెట్ లాంటోడు.
పవర్ స్టార్ ఈ పేరులోనే డైనమిజం ఉంది. అందులో అంతులేని శక్తి ఉంది. ఎవరు ఔనన్నా కాదన్నా తను ఇప్పుడు మోస్ట్ ఫెవరబుల్ లీడర్..డైనమిక్ యాక్టర్. ఆరోపణలను, విమర్శలను, అవమానాలను, ఇబ్బందులను తట్టుకుని నిలబడిన ఆంజనేయ భక్తుడు. కొండగట్టు ఆశీస్సులతో ఏపీలో జనసేన పార్టీతో జయకేతనం ఎగుర వేసిన జన సేనాని.
చిటికేస్తే లెక్కించ లేనంత మంది ఆత్మీయులను, ఫ్యాన్స్ ను స్వంతం చేసుకున్న అరుదైన వ్యక్తిత్వం కలిగిన యాక్టర్ పవన్ కళ్యాణ్ కొణిదల. పవన్ కళ్యాణ్ ఎలా రాణిస్తాడంటూ ఎద్దేవా చేసిన వాళ్ల నోళ్లను మూయించిన ఏకైక లీడర్ పవర్ స్టార్.
ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ వైరల్ గా మారాడు. ట్రెండింగ్ లో కొన సాగుతున్నారు.