వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం బిజీ
తెల్లవారుజామున 3 గంటల దాకా పర్యటన
విజయవాడ – రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా చోటు చేసుకున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సోమవారం తెల్లవారుజామున మూడు గంటల వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లోనే ఉన్నారు. బాధితులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.
కృష్ణలంక, ఇబ్రహీంపట్నం, ఫెర్రీ, జూపూడి, మూలపాడు ప్రాంతాల్లో పర్యటించారు ముఖ్యమంత్రి. ఇళ్లలోకి నీళ్ళు వచ్చి చేరడంతో రోడ్లపైకి వచ్చారు స్థానికులు.
అర్ధరాత్రి సమయంలో కూడా బాధితుల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు నారా చంద్రబాబు నాయుడు.
అందరికీ ఆహారం, నీళ్ళు సరఫరా చేస్తున్నామని స్పష్టం చేశారు సీఎం. ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే బాధితులు వెంటనే ప్రభుత్వం ప్రకటించిన టోల్ ఫ్రీ నెంబర్ 112 లేదా 1070 నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు .
ఎవరూ అధైర్య పడొద్దని ఏపీ కూటమి సర్కార్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ప్రతి ఒక్కరూ ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. పరిస్థితులు చక్కదిద్దే వరకు బాధితుల మధ్యనే ఉంటానని స్పష్టం చేశారు.