వరద బాధితులకు బాసటగా నిలవాలి
పిలుపునిచ్చిన దర్శకుడు హరీశ్ శంకర్
హైదరాబాద్ – డైనమిక్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాయవ్య బంగాళా ఖాతంలో చోటు చేసుకున్న అల్పపీడనం కారణంగా ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
సోమవారం సోషల్ మీడియా ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. మనవంతు బాధ్యతగా స్పందొంచాలని, మానవతను చాటు కోవాలని పిలుపునిచ్చారు. వరద ప్రభావిత, ముంపునకు గురైన ప్రాంతాలలో సహాయ కార్యక్రమాలలో పాల్గొనాలని సూచించారు దర్శకుడు హరీశ్ శంకర్.
ఇదిలా ఉండగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన , తాను తీసిన గబ్బర్ సింగ్ ను రీ రిలీజ్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున ప్రజాదరణ లభిస్తోందని అన్నారు. అయితే తమ చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు డైరెక్టర్.
గబ్బర్ సింగ్ ప్రదర్శిస్తున్న థియేటర్లను సందర్శించకుండా బాధితులకు సంఘీ భావంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.