ఎమర్జెన్సీ మూవీ విడుదల వాయిదా
ఇందిర గాంధీ పాత్రలో కంగనా రనౌత్
ముంబై – ప్రముఖ వివాదాస్పద నటి, భారతీయ జనతా పార్టీ ఎంపీ కంగనా రనౌత్ కు షాక్ తగిలింది. తను కీలక పాత్ర పోషించిన ఎమర్జెన్సీ చిత్రం విడుదల వాయిదా పడింది. ఈ సినిమాకు సంబంధించి కేంద్ర సెన్సార్ బోర్డు ఇంకా అనుమతి ఇవ్వలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురైంది నటి కంగనా రనౌత్.
ఈ చిత్రం విడుదల కాకుండానే తీవ్ర ఆరోపణలు , అభ్యంతరాలు ఎదుర్కొంటోంది. దీనికి కారణం భారత దేశ రాజకీయాలలో ఎమర్జెన్సీ అనేది చీకటి రోజులకు ప్రతీక. ఆనాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒకే ఒక్క సంతకంతో అప్పటి దివంగత ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించింది. వేలాది మంది ప్రతిపక్ష నేతలను జైలుపాలు చేసింది.
దీనికి ప్రధాన కారకురాలు ఇందిరా గాంధీ అనేది జగమెరిగిన సత్యం. ఇదిలా ఉండగా దివంగత ప్రధాని ఇందిర పాత్రను ఎమర్జెన్సీ చిత్రంలో పోషించింది నటి , బీజేపీ ఎంపీ కంగనా రనౌత్. ఆమె గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. మొత్తంగా తను నటించిన , ఆశలు పెట్టుకున్న చిత్రం విడుదల కాక పోవడంతో తీవ్ర నిరాశను వ్యక్తం చేసింది.