బాధితులకు ఇబ్బంది లేకుండా చూడండి
ఉన్నతాధికారులను ఆదేశించిన సీఎం బాబు
విజయవాడ – ఏపీ అంతటా ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దెబ్బకు రాష్ట్రం అతలాకుతలంగా మారి పోయింది. ఎక్కడ చూసినా నీళ్లే దర్శనం ఇస్తున్నాయి. జన జీవనం పూర్తిగా స్తంభించి పోయింది. చుట్టు పక్కల అంతా నీళ్లే నిండుకుని ఉన్నాయి. మరి కొన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
ఈ సమయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నిద్రహారాలు మాని వర్షాల తీవ్రతను , పునరావాస చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేపడుతున్నారు. ఆయా శాఖల ఉన్నతాధికారులను అప్రమత్తం చేస్తూనే పలు కీలకమైన సూచనలు, సలహాలు ఇస్తున్నారు.
గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఇప్పుడు ఈ విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు దోహద పడ్డాయని చెప్పక తప్పదు.
మంత్రులంతా వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. బాధితులను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఎమ్మెల్యేలు సైతం తమ తమ నియోజకవర్గాలలో సహాయక చర్యలలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. బాధితులకు అండగా ఉంటున్నారు. స్థానికులకు భరోసా కల్పిస్తున్నారు.
ఇదిలా ఉండగా బాధితులకు ఆహారం, పండ్లు, నీళ్లు అందజేయాలని ఎక్కడా ఇబ్బందులు ఎదురు కావద్దని ఆదేశించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.