కూల్చి వేతలు ఆపండి బాధితులను ఆదుకోండి
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు భారీ వర్షాలు, వరద ఉధృతితో రాష్ట్రంలోని పలు జిల్లాలు అస్తవ్యస్తంగా మారాయని ఆవేదన చెందారు. ఇప్పటి వరకు 9 మందికి పైగా చని పోయినట్లు సమాచారం ఉందన్నారు.
ప్రజలు కష్టాల్లో ఉన్నారని, సహాయక చర్యల కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు హరీశ్ రావు. ఇంట్లో వరద నీరు, కంట్లో ఎడతెగని కన్నీరు. వరద సృష్టించిన విలయాన్ని చూస్తుంటే గుండె తరుక్కు పోతోందని వాపోయారు .
ప్రభుత్వం కొంతకాలం శుష్క రాజకీయాలు, కూల్చి వేతలను ఆపి బాధితులను ఆదుకోవడం పై సంపూర్ణంగా దృష్టి కేంద్రీకరించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఇప్పటికే తక్షణ సహాయ చర్యలు అందలేదని జనం తమ గోడు వెళ్ల బోసుకుంటున్నరాని, అయినా సర్కార్ స్పందించక పోవడం దారుణమన్నారు.
ప్రభుత్వం బాధ్యతాయుతంగా మనసు పెట్టి చర్యలు తీసుకోవాలని, వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.. విద్యుత్ సరఫరాను పునర్దరించాల్సిన చోట వేగంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. . ఆహారం, నీరు అందుబాటులో ఉంచాలని సూచించారు మాజీ మంత్రి..
అసలే రాష్ట్రం విష జ్వరాలతో విలవిల లాడుతోందని, ఈ వరదలు, వర్షాల వల్ల మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు.