లిక్కర్ కేసులో విజయ్ నాయర్‌కు బెయిల్
ఒక్కరొక్కరుగా బయటకు వస్తున్న వైనం
ఢిల్లీ – దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఒక్కరొక్కరు బయటకు వస్తున్నారు. మొన్న ఆప్ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ దక్కింది.
ఇదే కేసులో 166 రోజుల పాటు తీహార్ జైలులో ఉన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కూతురు , ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఇదే క్రమంలో మద్యం కేసులో జైలులో ఉన్న విజయ్ నాయర్ కు సోమవారం బెయిల్ మంజూరు చేసింది సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం.
పిఎమ్ఎల్ఎలోని సెక్షన్ 45పై ప్రత్యేక నిబంధనను పరిగణనలోకి తీసుకోవడం జరిగిందని, దీని ప్రకారం కవితకు బెయిల్ ఇవ్వాల్సి వచ్చిందని తెలిపింది కోర్టు.
ఆర్టికల్ 21 ప్రకారం స్వేచ్ఛా హక్కు పవిత్రమైనదని పేర్కొంది. కఠినమైన నిబంధనలు రూపొందించబడిన సందర్భాల్లో కూడా గౌరవించబడాలని స్పష్టం చేసింది.
పిటిషనర్ 23 నెలల పాటు కస్టడీలో ఉన్నాడని, అండర్ ట్రయల్‌గా జైలులో ఉన్నాడని విచారణ ప్రారంభించకుండా ఇది శిక్షా విధానం కాదని కోర్టు అభిప్రాయ పడింది.
నేరం రుజువైన సాయంత్రం గరిష్టంగా 7 సంవత్సరాలు మాత్రమే శిక్ష పడే అవకాశం ఉన్నపుడు, పిటిషనర్‌ను ఇంత సుదీర్ఘకాలం పాటు అండర్ ట్రయల్‌గా నిర్బంధంలో ఉంచడం సబబు కాదని, అందుకే బెయిల్ ఇస్తున్నట్లు తెలిపింది.