NEWSANDHRA PRADESHTELANGANA

వ‌ర్షం ఎఫెక్ట్ ప‌లు రైళ్లు బంద్

Share it with your family & friends

450 రైళ్లు ర‌ద్దు చేసిన ఎస్సీఆర్

సికింద్రాబాద్ – భారీ వ‌ర్షాల కార‌ణంగా ద‌క్షిణ మ‌ధ్య రైల్వే కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. చాలా చోట్ల రైల్వే ట్రాక్ ల‌కు మ‌ర‌మ్మ‌త్తులు చేయాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. యుద్ద ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు చేప‌ట్టింది ద‌క్షిణ మ‌ధ్య రైల్వే.

ఇదిలా ఉండ‌గా కుండ పోత‌గా కురుస్తున్న వ‌ర్షాల దెబ్బ‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప‌రిధిలో ఏకంగా 450 రైళ్ల‌ను ర‌ద్దు చేసింది. ముందు జాగ్ర‌త్త‌గా ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలిపింది. ఇప్ప‌టికే వ‌ర్షాల కార‌ణంగా ప‌లు ప్రాజెక్టులు నిండు కుండ‌ల‌ను త‌ల‌పింప చేస్తున్నాయి.

విజ‌య‌వాడ జ‌ల దిగ్బంధంలో చిక్కుకు పోయింది. మ‌రో వైపు స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశారు. నిన్న ఉన్న‌ట్టుండి భారీ వ‌ర‌ద రావ‌డంతో రైల్వే లు కొన్నింటిని రైల్వే స్టేష‌న్ ల‌లో నిలిపి వేశారు. త‌మిళ‌నాడు ఎక్స్ ప్రెస్ రైలును అర్దాంత‌రంగా ఆపారు.

దీంతో రైలులో ప్ర‌యాణిస్తున్న 1600 మందికి పైగా ప్ర‌యాణీకుల‌ను ఏపీ ప్ర‌భుత్వం సుర‌క్షితంగా విజ‌య‌వాడ‌కు త‌ర‌లించింది. అక్క‌డ పున‌రావాస ప్రాంతాల‌లో ఉంచింది. ఆహారం, పండ్లు, నీళ్లు ఇచ్చింది.

ఇప్ప‌టి వ‌ర‌కు 140కి పైగా రైళ్ల‌ను దారి మ‌ళ్లించింది ద‌క్షిణ మధ్య రైల్వే. తాత్కాలికంగా 20 రైళ్ల‌ను ర‌ద్దు చేశారు. ఇక వ‌ర్షం కార‌ణంగా మ‌హ‌బూబాబాద్ – కేస‌ముద్రం వ‌ద్ద శ‌ర‌వేగంగా ట్రాక్ ప‌నులు కొన‌సాగుతున్నాయి.