వర్ష భీభత్సం రూ. 5438 కోట్ల నష్టం
తెలంగాణ ప్రభుత్వం నివేదక వెల్లడి
హైదరాబాద్ – తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఇప్పటి వరకు వర్షాలు, వరదల కారణంగా వాటిల్లిన నష్టం గురించి వెల్లడించింది. భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం చోటు చేసుకుందని తెలిపింది.
ఈ మేరకు వరదలకు సంబంధించి నివేదిక వెల్లడించింది. ఇప్పటి వరకు వరద ప్రభావిత ప్రాంతాలలో
110 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. 4000 మందిని సురక్షితంగా పునరావాస శిబిరాలకు తరలించినట్లు పేర్కొంది.
మొత్తం నష్టం సుమారు రూ. 5438 కోట్లు వాటిల్లినట్లు వెల్లడించింది. రోడ్లు భవనాల శాఖకు సంబఃధించి రూ. 2362 కోట్లు, ఇంధన విభాగానికి సంబంధించి రూ. 175 కోట్లు, 4,15000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని రూ. 415 కోట్లు ఉంటుందని తెలిపింది ప్రభుత్వం.
నీటిపారుదల (మైనర్ ట్యాంకుల మరమ్మత్తు)కు సంబంధించి రూ. 629 కోట్లు , పంచాయతీ రాజ్ , గ్రామీణాభివృద్ధి (RWSతో సహా) రూ. 170 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు రూ. 12 కోట్లు, పశు సంవర్దక శాఖకు సంబఃధించి రూ. 25 కోట్లు , పురపాలిక శాఖకు సంబంధించి రూ. 1150 కోట్లు, ఇతర విభాగాలలో చోటు చేసుకున్న నష్టానికి సంబంధించి మరో రూ. 500 కోట్లు నష్టం వాటిల్లిందని వెల్లడించింది తెలంగాణ ప్రభుత్వం.