NEWSTELANGANA

ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం ప్ర‌జ‌ల‌కు శాపం

Share it with your family & friends

నిప్పులు చెరిగిన హ‌రీశ్ రావు

హైద‌రాబాద్ – మాజీ మంత్రి హ‌రీశ్ రావు సీరియ‌స్ కామెంట్స్ చేశారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్ర‌భుత్వంపైన‌. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కీల‌క స‌మ‌యంలో స్పందించ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు. ఓ వైపు సాయం కోసం ప్ర‌జ‌లు ఆర్త‌నాదాలు చేస్తుంటే మంత్రులు మ‌రో వైపు ఎంజాయ్ చేయ‌డం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి.

అస‌లు రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఉందా అన్న అనుమానం క‌లుగుతోంద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 16 మంది చ‌ని పోయిన‌ట్లు కూల్ గా సీఎం రేవంత్ రెడ్డి చెప్ప‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఒక బాధ్య‌త క‌లిగిన ముఖ్య‌మంత్రి ఇలాగేనా మాట్లాడేది అంటూ మండిప‌డ్డారు.

ఓ వైపు భారీ వ‌ర్షాలు , వ‌ర‌దలు వ‌స్తున్నా ఎందుకు ప‌ట్టించు కోలేద‌ని ప్ర‌శ్నించారు. మంత్రులు నిద్ర పోతున్నార‌ని, సీఎం చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు.

ఒక యువ శాస్త్రవేత్తతో పాటు సుమారు ఇరవై మంది ఈ వరదల్లో ప్రాణాలు కోల్పోయారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు హ‌రీశ్ రావు. వేలాది మంది నిరాశ్రయులయ్యారని వాపోయారు.

ఒక మంత్రి హెలికాప్టర్లు దొరక లేదంటాడు. మరొక మంత్రి, ఈ రాష్ట్రానికి సీఎం లేనట్టు పక్క రాష్ట్ర సీఎంకు ఫోన్ చేస్తాడంటూ ఎద్దేవా చేశారు. మూడో మంత్రి ఫోటోలకు పోజులకే పరిమితమవుతాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు.

జరగాల్సిన నష్టమంతా జరిగాక పూల డెకరేషన్ స్టేజీ మీద కూర్చొని , వ‌ర‌ద‌లపై స‌మీక్ష చేసే సీఎంను తాను ఇంత వ‌ర‌కు చూడ లేద‌న్నారు.