NEWSTELANGANA

ముందే హెచ్చ‌రించినా స్పందించ‌ని స‌ర్కార్

Share it with your family & friends

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా ఆయ‌న స్పందించారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్ర‌భుత్వం పాల‌నా ప‌రంగా వైఫ‌ల్యం చెందింద‌ని ఆరోపించారు.

సీఎం రేవంత్ రెడ్డి బాధ్య‌తా రాహిత్యంగా మాట్లాడుతున్నాడ‌ని మండిప‌డ్డారు. కేంద్ర ప్ర‌భుత్వం వ‌ర్షాలు వ‌స్తాయ‌ని, వ‌ర‌ద‌లు ముంచెత్తుతాయ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించింద‌ని, అయినా స‌ర్కార్ ప‌ట్టించు కోలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

దీని కార‌ణంగా 16 మందికి పైగా ప్రాణాలు కోల్పోయార‌ని, భారీ ఎత్తున న‌ష్టం వాటిల్లింద‌ని , సాయం చేయ‌డంలో, కార్య‌క్ర‌మాల‌లో పాల్గొన‌డంలో ఘోరంగా విఫ‌లం చెందార‌ని ధ్వ‌జ‌మెత్తారు కేటీఆర్. ఇది ఎంత మాత్రం మంచిది కాద‌న్నారు.

ప్రకృతి ఉగ్రరూపం దాలుస్తే దాని ముందు అందరం తల వంచాల్సిందే.. కానీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఆ భీభత్సం నుండి చాలా వరకు ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని తెలిపారు కేటీఆర్. ఒక గొప్ప సైంటిస్టుతో సహా ప‌లువురు ప్రాణాలు కోల్పోయారు. దీనికి కాంగ్రెస్ స‌ర్కార్ పూర్తి బాధ్య‌త వహించాల‌ని పేర్కొన్నారు.

ఆగస్టు 31 నాడే ఆరంజ్ అలర్ట్ ఇచ్చింది తెలంగాణ వాతావరణ శాఖ. కానీ స‌ర్కార్ మొద్దు నిద్ర పోయింద‌ని ఆరోపించారు కేటీఆర్.