వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు
బాధితులకు అండగా నిలిచిన వైనం
అమరావతి – భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. బాధితులకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.
మంత్రులు, ఉన్నతాధికారులు సహాయక చర్యలలో నిమగ్నం అయ్యారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడంలో కీలక పాత్ర పోషించారు. అంతే కాకుండా ఆయా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు పూర్తిగా ప్రభావిత ప్రాంతాలలోనే మకాం వేశారు.
తాజాగా బాపట్ల జిల్లా రేపల్లెలో రాత్రి మొత్తం కట్ట మీదే ఉంటూ పనులు పర్యవేక్షించారు ఏపీ మంత్రులు గొట్టిపాటి, అనగాని సత్య ప్రసాద్.
గండి పడుతుందేమో అని అక్కడే ఉన్నారు. వరద ప్రభావం తగ్గడంతో మంత్రులతో పాటు ఉన్నతాధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా మంత్రులు గొట్టిపాటి, అనగాని సత్య ప్రసాద్ మీడియాతో మాట్లాడారు.
సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వరద ప్రభావిత ప్రాంతాలలోనే మకాం వేశామన్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేశామని చెప్పారు. బాధితులను పునరావాస కేంద్రాలకు చేరవేసినట్లు తెలిపారు.