అక్టోబరు 8న ద్విచక్ర వాహనాలు నిషేధం
గరుడ సేవ దృష్ట్యా తిరుమలకు
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు మంగళవారం ఈవో జె. శ్యామల రావు బ్రహ్మోత్సవాల గురించి వివరాలు వెల్లడించారు. ఇందులో భాగంగా
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీవారికి అత్యంత ప్రియమైన గరుడ సేవను వచ్చే అక్టోబర్ నెలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు .
ఇదిలా ఉండగా అక్టోబర్ 8న సుదూర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలి రానున్నారు. కాగా భక్తలను దృష్టిలో పెట్టుకుని టీటీడీ రెండు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాక పోకలను నిషేధించినట్లు స్పష్టం చేశారు ఈవో జె. శ్యామల రావు.
ఈ సంవత్సరం తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4 నుండి 12 వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయని తెలిపారు. అక్టోబర్ 8న ముఖ్యమైన గరుడ సేవను అంగరంగ వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు ఈవో జె. శ్యామల రావు.
కాబట్టి అక్టోబర్ 7న రాత్రి 9 గంటల నుండి అక్టోబర్ 9 ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలు అనుమతించడం కుదరదని, వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని, టీటీడీకి సహకరించాలని కోరారు.