నేవీ హెలికాప్టర్ల ద్వారా ఆహారం పంపిణీ
స్పందించిన కేంద్రం సీఎం సంతోషం
అమరావతి – ఓ వైపు వర్షాలు మరో వైపు వరదలతో అస్తవ్యస్తంగా మారింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యవేక్షణలో మంత్రులు, ఉన్నతాధికారులు సహాయక చర్యలలో నిమగ్నమయ్యారు.
ఇందులో భాగంగా కేంద్రం స్పందించింది. సహాయక చర్యలను అభినందిస్తూనే నేవీని దించింది. నేవీ హెలికాప్టర్లు 3వ రోజు వరద సహాయ చర్యలలో పాల్గొన్నారు. కీలక పాత్ర పోషిస్తున్నారు. ముంపు ప్రాంతాలలో హెలికాప్టర్ల ద్వారా ఆహారం, మంచినీటిని సరఫరా చేస్తున్నారు.
మరో వైపు బాధితులను పునరావాస కేంద్రాలకు చేర్చుతూ ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు వరదల ధాటికి 15 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని సీఎం వెల్లడించారు. కేంద్రం అడిగిన వెంటనే బోట్లను పంపించిందని తెలిపారు.
తాను కూడా నిత్యం పర్యవేక్షిస్తున్నానని, వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించానని చెప్పారు. బాధితులను పరామర్శించిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. ముగ్గురు గల్లంతు అయ్యారని, 20 జిల్లాల్లో భారీగా పంట నష్టం వాటిల్లినట్లు తెలిపారు. .