బన్నీతో అట్లీ మూవీ ఉన్నట్టా లేనట్టా
దాదాపుగా తప్పుకున్నట్లు ప్రచారం
హైదరాబాద్ – నటుడిగా బన్నీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక తమిళ సినీ రంగంలో మోస్ట్ పాపులర్ డైనమిక్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు అట్లీ. తను బాద్ షా షారుఖ్ ఖాన్ తో జవాన్ తీశాడు. అది రూ. 1000 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఇందులో షారూఖ్ తో పాటు నయనతార చేసిన నటనకు అందరూ ఫిదా అయ్యారు.
వీరితో పాటు అందాల ముద్దుగుమ్మ దీపికా పదుకొనే కూడా నటించింది..తళుక్కున మెరిసి మాయమైంది. ఇదే సమయంలో అట్లీ అల్లు అర్జున్ తో తదుపరి సినిమా గురించి చర్చలు జరిపారని, దీనికి బన్నీ కూడా ఓకే చెప్పినట్లు ఆ మధ్యన జోరుగా ప్రచారం జరిగింది.
తాజాగా అందిన సమాచారం మేరకు బన్నీ అట్లీతో చర్చలు పూర్తయినట్లు టాక్. ఈ చిత్రానికి తాత్కాలికంగా ఏఏఏ అనే పేరు పెట్టారు. ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్ పూర్తయింది. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అల్లు అర్జున్ సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో వైపు దర్శకుడు అట్లీ తదుపరి చిత్రం సల్మాన్ ఖాన్ తో తన చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు టాక్.