NEWSANDHRA PRADESH

భారీ వ‌ర్షం ప‌లు రైళ్లు ర‌ద్దు

Share it with your family & friends

రైల్వే ట్రాక్ ల పున‌రుద్ద‌ర‌ణ

అమరావ‌తి – ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల తాకిడికి ద‌క్షిణ మ‌ధ్య రైల్వే కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. గ‌త మూడు రోజులుగా ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేసింది. మ‌రికొన్నింటిని తాత్కాలిక నిలిపి వేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు 450 రైళ్ల‌ను ర‌ద్దు చేసింది.

సెప్టెంబ‌ర్ 3 మంగ‌ళ‌వారం ప‌లు రైళ్లు ర‌ద్దు చేసిన‌ట్లు ప్ర‌క‌ట‌న చేసింది. ఇవాళ మ‌రికొన్ని రైళ్ల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు తెలిపింది. ఇందులో భాగంగా 12709 నంబ‌ర్ క‌లిగిన గూడూరు – సికింద్రాబాద్ రైలు, 12727 – విశాఖపట్నం – హైదరాబాద్ , 12739 – విశాఖపట్నం – సికింద్రాబాద్ రైలును ర‌ద్దు చేసిన‌ట్లు పేర్కొంది.

ఈ రైళ్ల‌తో పాటు 20810 నంబ‌ర్ క‌లిగిన‌ నాందేడ్ – సంబల్ పూర్ రైలుతో పాటు 12745 – సికింద్రాబాద్ – మణుగూరు, 17659 – సికింద్రాబాద్ – భద్రాచలం రోడ్, 17250 – కాకినాడ పోర్ట్ – తిరుపతి రైలును నిలిపి వేసిన‌ట్లు స్ప‌ష్టం చేసింది.

17233 నంబ‌ర్ క‌లిగిన‌ సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్ నగర్ రైలుతో పాటు 12775 – కాకినాడ పోర్ట్ – లింగంపల్లి, 12615 ఎంజీఆర్ చెన్నై – న్యూ ఢిల్లీ, 17205 – సాయినగర్ షిరిడీ – కాకినాడ పోర్ట్, 12749 – మచిలీపట్నం – బీదర్ రైలును నిలిపి వేసిన‌ట్లు పేర్కొంది ద‌క్షిణ మ‌ధ్య రైల్వే.

దీంతో పాటు 12750 నంబ‌ర్ క‌లిగిన‌ బీదర్ – మచిలీపట్నం, 17208 – మచిలీపట్నం – సాయినగర్ షిరిడీ రైలును ర‌ద్దు చేసిన‌ట్లు స్ప‌ష్టం చేసింది.