NEWSANDHRA PRADESH

కొంద‌రు అధికారుల తీరుపై సీఎం సీరియ‌స్

Share it with your family & friends

వ‌ర‌ద బాధితుల ఇబ్బందులు దారుణం

అమ‌రావ‌తి – ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సీరియ‌స్ కామెంట్స్ చేశారు. బంగాళా ఖాతంలో చోటు చేసుకున్న అల్ప పీడ‌నం ఏర్ప‌డ‌డంతో కంటిన్యూగా వ‌ర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తూనే ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం.

మంగ‌ళ‌వారం చంద్ర‌బాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. వరద బాధితుల ఇబ్బందులు వర్ణనాతీతమ‌ని పేర్కొన్నారు. ఇళ్లలోకి పాములు, తేళ్లు వస్తున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

కొన్ని చోట్ల ఆహారం అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయ‌ని పేర్కొన్నారు. ఐవీఆర్ఎస్ సందేశాలకు ప్రజలు స్పందించాలని స్ప‌ష్టం చేశారు ఏపీ సీఎం.

వరద ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. సరిగా పనిచేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. సహాయ చర్యల కోసం డబ్బు గురించి ఆలోచించమ‌ని ప్ర‌క‌టించారు.. వరద బాధితుల సాయం కోసం ఎంత ఖర్చయినా చేస్తామ‌ని ప్ర‌క‌టించారు నారా చంద్ర‌బాబు నాయుడు. అత్యవసర వేళల్లో అధికారులు సర్వశక్తులు ఒడ్డి పని చేయాల‌ని పిలుపునిచ్చారు.