తెలంగాణ ఉద్యోగుల విరాళం రూ. 130 కోట్లు
వరద బాధితుల కోసం సాయం చేసిన సిబ్బంది
హైదరాబాద్ – రాష్ట్రంలో వరద సహాయక చర్యలకు తమ ఒక రోజు మూల వేతనం రూ. 130 కోట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెక్కు రూపంలో అందజేశారు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు. ఈ సందర్బంగా ఉద్యోగుల ఉదారతను ప్రశంసించారు.
మరో వైపు ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 50 లక్షలు ప్రకటించారు. ఏపీకి కూడా రూ. 50 లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు నిర్మాతలు , సినీ నటులు తమ వంతు సహాయం ప్రకటించారు.
అనంతరం రాష్ట్రంలో వరద ప్రభావిత పరిస్థితులపై ఆరా తీశారు. మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం పురుషోత్తమయ గూడెం వద్ద ఆకేరు వాగు ఉధృతికి కొట్టుకుపోయిన హైలెవల్ వంతెనను, పంట పొలాలను రేవంత్ రెడ్డి పరిశీలించారు.
మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి , సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ పోరిక బలరాంనాయక్ , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం పరిశీలించారు. బాధితులను పరామర్శించారు.
అంతకు ముందు యువ శాస్త్రవేత్త అశ్విని, ఆమె తండ్రి మోతీలాల్ పయనిస్తున్న కారు కొట్టుకుపోయిన ప్రదేశాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. వంతెన పునరుద్ధరణ పనులను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు.