వ‌ర‌ద బాధితుల‌కు విద్యార్థిని విరాళం

Share it with your family & friends

అభినందించిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – వ‌ర‌ద బాధితుల కోసం మ‌హ‌బూబాబాద్ జిల్లాకు చెందిన ప‌దవ త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థిని ముత్యాల సాయి సింధు ఉదార‌త‌ను చాటుకున్నారు. త‌ను నెల నెలా దాచుకున్న డ‌బ్బుల నుంచి రూ. 3 వేలను సాయంగా మంగ‌ళ‌వారం పర్య‌టించిన ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డికి త‌న‌వంతుగా అందించారు. ఈ సందర్భంగా చిన్నారిని అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు.

వరద సహాయక చర్యలకు తన కిట్టీ బ్యాంకు నుంచి డ‌బ్బుల‌ను ఇవ్వ‌డం త‌న‌కు సంతోషాన్ని క‌లిగించింద‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా న‌టులు, ఉద్యోగులు సైతం త‌మ వంతుగా విరాళాల‌ను అంద‌జేశారు.

బాధితుల కోసం తమ ఒక రోజు మూల వేతనం రూ. 130 కోట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెక్కు రూపంలో అందజేశారు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు. ఈ సంద‌ర్బంగా ఉద్యోగుల ఉదార‌త‌ను ప్ర‌శంసించారు సీఎం.

మ‌రో వైపు ప్ర‌ముఖ సినీ న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ వ‌ర‌ద బాధితుల కోసం ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి రూ. 50 ల‌క్ష‌లు ప్ర‌క‌టించారు. ఏపీకి కూడా రూ. 50 ల‌క్ష‌లు ఇస్తున్న‌ట్లు తెలిపారు. ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తో పాటు నిర్మాత‌లు , సినీ న‌టులు త‌మ వంతు సహాయం ప్ర‌క‌టించారు.