హరీశ్..జగదీశ్ వాహనాలపై దాడి
ఖమ్మంలో చోటు చేసుకున్న ఉద్రిక్తత
ఖమ్మం జిల్లా – భారీ వర్షాల తాకిడికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఖమ్మం జిల్లాలో మంగళవారం వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంచుతుండగా మాజీ మంత్రులు తన్నీరు హరీశ్ రావు, గుండ్లకంట్ల జగదీశ్వర్ రెడ్డి ప్రయాణిస్తున్న కార్లపై దాడికి దిగారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
కాంగ్రెస్ గూండాలు కావాలని దాడులకు దిగారని ఆరోపించారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపినందుకు అక్కసుతో దాడి చేశారు. ఈ దాడుల్లో బీఆర్ఎస్ కార్యకర్త ఒకరికి కాలు విరగడంతో ఆసుపత్రికి తరలించారు.
పక్కా ప్లాన్ ప్రకారం ఖమ్మం పోలీసుల సహకారంతోనే బీఆర్ఎస్ నాయకుల బృందం మీద దాడి జరిగిందన్నారు.
కార్యకర్తల తల పగల గొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు, రెండు కార్ల అద్దాలు ధ్వంసం చేశారని.. ఖమ్మం పోలీస్ కమిషనర్ వెంటనే స్పందించి బాధ్యుల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి.
ఈ కాల్వకట్ట (సాగర్ ఎడమ కాల్వ గండి) దెబ్బ తినడానికి ప్రధానమైన కారణం ప్రభుత్వమేనని ఆరోపించారు.