బాధితులకు మంత్రి..ఎమ్మెల్యే బాసట
వరద ప్రభావిత ప్రాంతాలలో మంత్రి
విజయవాడ – వర్షాలు విజయవాడను వెంటాడుతున్నాయి. ఎక్కడ చూసినా నీళ్లు . మరో వైపు ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష చేపడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ పరుగులు పెట్టిస్తున్నారు.
తాజాగా మంగళవారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల శ్రీ వీరాంజనేయ స్వామితో పాటు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వరదల్లో చిక్కుకు పోయిన బాధితులకు బాసటగా నిలిచారు. వస్తువులను మోస్తూ సాయం చేశారు.
ఇదిలా ఉండగా విజయవాడ రూరల్ మండలం అంబాపురంలో వరద సహాయక చర్యలను పర్యవేక్షించారు. అధికారులు, సిబ్బంది సహాయక చర్యలలో పాల్గొన్నారు. తమ వంతు బాధ్యతలను నిర్వహిస్తుండడం పట్ల అభినందించారు మంత్రి వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు.