సెమీ కండక్టర్ ఇండస్ట్రీపై కేటీఆర్ కామెంట్స్
ప్రభుత్వ చేతకానితనం వల్లనే ఇదంతా
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ కామెంట్స్ చేశారు. తమ ప్రభుత్వ హయాంలో తీసుకు వచ్చిన కంపెనీలు తెలంగాణను విడిచి వెళుతుండడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.
కంపెనీలు వెళ్లి పోవడానికి ప్రధాన కారణం సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించు కోక పోవడం, నిర్లక్ష్యం వహించడం తప్ప మరోటి కాదని పేర్కొన్నారు.
గత ఏడాది తాము సెమీ కండక్టర్ ఇండస్ట్రీని తీసుకు వచ్చేలా, ఒప్పించడం జరిగిందని తెలిపారు కేటీఆర్. కర్ణాటక నుండి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు జరిగేలా చూశామన్నారు కేటీఆర్. ఆనాడు ఎన్నో ఇబ్బందులు పడ్డామని పేర్కొన్నారు.
హైదరాబాద్ విమానాశ్రయానికి సమీపంలోని కొంగర కలాన్‌లో ఫాక్స్‌కాన్ ప్లాంట్ పక్కనే భూమిని కేటాయించాలని కోరామన్నారు. కేవలం 10 రోజులలోనే పని పూర్తి చేశామని వెల్లడించారు. ఇదిలా ఉండగా పుండు మీద కారం చల్లినట్లు సెమీ కండక్టర్ పరిశ్రమ తెలంగాణ నుంచి గుజరాత్ కు తరలి పోతుందనే వార్త తెలిసి విస్తు పోయానని పేర్కొన్నారు.
సెమీ కండక్టర్ పరిశ్రమలో రూ. 3,500 కోట్లకు పైగా పెట్టుబడిని కోల్పోవడం బాధాకరమని అన్నారు.