హ్యాట్సాఫ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీకృష్ణ
చెంచులను కాపాడినందుకు అభినందన
నాగర్ కర్నూల్ జిల్లా – నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆపదలో ఆదుకున్నారు. భారీ వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున కుండ పోత వర్షం కురుస్తోంది. దీంతో జన జీవనం స్తంభించి పోయింది.
ఇదిలా ఉండగా అచ్చంపేట నియోజకవర్గానికి సమీపంలో ఉన్న డిండి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాల తాకిడికి డిండి జలాశయం పూర్తిగా నిండి పోయింది. ఇదే సమయంలో వాగు మధ్యలో చిక్కుకు పోయారు పది మంది చెంచు కుటుంబాలకు చెందిన వారు.
తమను రక్షించమని వేడుకోవడం , చుట్టు పక్కల వారు విషయం తెలుసుకుని అచ్చంపేట శాసన సభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణకు చేరవేశారు.
ఆపదల్లో ఉన్న చెంచు కుటుంబాల గురించి తెలిసిన వెంటనే హుటా హుటిన పోలీసులకు, జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించారు.
తను కూడా డిండి వాగు ప్రమాదంలో చిక్కుకున్న ఘటనా స్థలానికి వెళ్లారు. వాగు ఉధృతి నుంచి పది మంది చెంచులను పోలీసుల సాయంతో కాపాడారు. విషయం తెలుసుకుని ప్రాణాలకు తెగించి కాపాడిన పోలీసులను, రెస్క్యూ సిబ్బందిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. బాధితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే వంశీకృష్ణను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు.