NEWSANDHRA PRADESH

వ‌ర‌ద బాధితుల కోసం జ‌గ‌న్ కోటి సాయం

Share it with your family & friends

ప్ర‌క‌టించిన ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి

అమ‌రావ‌తి – ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. వ‌ర్షాల కార‌ణంగా ఏపీ అస్త‌వ్య‌స్తంగా మారింది. బాధితుల‌ను ఆదుకునేందుకు మాన‌వ‌తా దృక్ఫ‌థంతో స్పందించారు. ఈ మేర‌కు త‌న వంతుగా రూ. 1 కోటిని ప్ర‌క‌టించారు.

ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం రాష్ట్రంలో వ‌ర‌ద‌లపై తాడేప‌ల్లిగూడెంలోని పార్టీ కార్యాల‌యంలో స‌మీక్షించారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. కృష్ణా నదికి భారీ వరదలు ముంచెత్త‌డంపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. త‌మ హ‌యాంలో నిర్మించిన వాల్ వ‌ల్ల‌నే కృష్ణ లంక ఇవాళ సుర‌క్షితంగా ఉంద‌ని ఈ సంద‌ర్బంగా వైసీపీ ప్ర‌జా ప్ర‌తినిధులు జ‌గ‌న్ రెడ్డికి తెలిపారు.

వరద ముంచెత్తిన ప్రాంతాల్లో ప్రభుత్వం ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేపట్టడం లేదని, లక్షలాది మంది కనీసం ఆహారం, మంచి నీరు కూడా దొరక్క నానా ఇబ్బంది పడుతున్నారని సమావేశంలో నేత‌లు వెల్లడించారు.

కేవలం ప్రచార ఆర్భాటం తప్ప, వాస్తవంగా ఎలాంటి చర్యలు అక్కడ లేవని ఆరోపించారు. వరద ప్రాంతాల్లో షో చేస్తూ, ఫోటోలకు ఫోజులు ఇస్తూ, సీఎం చంద్ర‌బాబు ఎంజాయ్ చేస్తున్నారంటూ మండిప‌డ్డారు.

వరద బాధితులు అనారోగ్యం పాలవుతున్నా, వారికి మందులు కూడా లభించడం లేదని, చివరకు పాలు కూడా దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.

కాగా తన పర్యటనలో వరద బాధితులు పడుతున్న కష్టాలను స్వయంగా చూశానన్న జగన్, వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని తెలిపారు.