NEWSTELANGANA

ప్ర‌తిప‌క్ష నేత‌లు దొర‌ల్లా మాట్లాడితే ఎలా..?

Share it with your family & friends

మంత్రి దామోద‌ర రాజ న‌ర‌సింహ ఫైర్

హైద‌రాబాద్ – ప్ర‌తిప‌క్ష నాయ‌కులు ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని, వారు త‌మంత‌కు తాము దొర‌మ‌ల‌ని భావిస్తున్నార‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ న‌ర‌సింహ‌.

హైద‌రాబాద్ లోని గాంధీ ఆస్ప‌త్రిని ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. అనంత‌రం ఆస్ప‌త్రిలో స‌మీక్ష చేప‌ట్టారు. ఆసుపత్రి లో ఎన్ని పడకలు అందుబాటులో ఉన్నాయని, ఎంత మందికి ఓపీ సేవ‌లు అంద జేస్తున్నారంటూ ప్ర‌శ్నించారు మంత్రి.

అనంతరం దామోదర రాజ నరసింహ ఓపి బిల్డింగ్ లోని అన్ని విభాగాలను పరిశీలించారు . రోగులతో మాట్లాడారు. వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందుతున్న సేవల పై అడిగి తెలుసుకున్నారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల కోసం వచ్చిన సహాయకులకు మెరుగైన సదుపాయాలను కల్పించాలని ఆసుపత్రి సూపరిoటెండెంట్ ను ఆదేశించారు. అనంత‌రం దామోద‌ర రాజ న‌ర‌సింహ మీడియాతో మాట్లాడారు. తాను దొర‌ను కాన‌ని ద‌ళిత బిడ్డ‌న‌ని అన్నారు మంత్రి.