బాధితుల కోసం ప్రజా ప్రభుత్వం
ఎంతటి సాయం చేసేందుకైనా సిద్దం
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వరదల కారణంగా నష్ట పోయిన వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు 5 లక్షలకు పైగా పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ఇప్పటికే ఆయా జిల్లాలకు ముందు జాగ్రత్తగా బాధితులను ఆదుకునేందుకు గాను రూ. 5 కోట్లు మంజూరు చేసినట్లు స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. తాను పర్యటించేందుకు వెళతానంటే కొందరు వద్దన్నారు. పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు.
అయినా తాను ముందుకే వెళ్లానని తెలిపారు సీఎం. ఆరు నూరైనా సరే ఎన్ని కష్టాలు పడినా సరే వరద సాయం చేస్తామని ప్రకటించారు. రైతులను ఆదుకుంటామని, బాధితులకు మేలు చేకూర్చేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
అధికార యంత్రాంగం అష్ట కష్టాలు పడి సహాయక చర్యలలో నిమగ్నమై ఉందన్నారు ఎ. రేవంత్ రెడ్డి. కేంద్రం వెంటనే స్పందించాలని , జాతీయ విపత్తుగా ప్రకటించాలని, పీఎం నరేంద్ర మోడీ పర్యటించాలని కోరారు .