బుడమేరు గండి పూడ్చి వేత
పరిశీలించిన మంత్రులు లోకేష్..నిమ్మల
అమరావతి – రాష్ట్రంలో చోటు చేసుకున్న వరద బీభత్సం కారణంగా ఎక్కడికక్కడ జన జీవనం స్తంభించి పోయింది. ఏపీ సర్కార్ యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ప్రధానంగా సీఎం చంద్రబాబు నాయుడు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు సమీక్ష చేపడుతూ మంత్రులు, ఉన్నతాధికారులను పురమాయిస్తున్నారు.
ఇందులో భాగంగా సీఎం ఆదేశాల మేరకు మంత్రులు నారా లోకేష్ , నిమ్మల రామానాయుడు బుధవారం బుడమేరు గండి పూడ్చే పనులను పరిశీలించారు. అధికారులు, సిబ్బంది అవిశ్రాంతంగా పనిచేసి మొదటి గండి పూడ్చారు.
గత ఐదేళ్లలో కనీస మరమ్మత్తుల పనులు కూడా చెయ్యక పోవడమే గండ్లు పడటానికి ప్రధాన కారణమని అధికారులు ఈ సందర్బంగా మంత్రులకు వివరించారు. వీలైనంత త్వరగా గండ్లు పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష చేపట్టారు నారా లోకేష్.
విజయవాడ వరద బాధితులకు అధికార యంత్రాంగం, టిడిపి నేతలు ద్వారా సత్వర సాయం అందేలా ఏర్పాట్లు చేసి పర్యవేక్షిస్తున్నారు. వరద తగ్గిన ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగవంతం అయినట్లు చెప్పారు నారా లోకేష్, నిమ్మల రామానాయుడు.