NEWSTELANGANA

తెలంగాణ స‌ర్కార్ కు హోం శాఖ ఘాటు లేఖ‌

Share it with your family & friends

వ‌ర‌ద న‌ష్టం వివ‌రాలు త‌క్ష‌ణ‌మే పంపాలి

ఢిల్లీ – కేంద్ర హోం శాఖ సీరియ‌స్ అయ్యింది. తెలంగాణ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు బుధ‌వారం ప్ర‌భుత్వానికి ఘాటుగా లేఖ రాశారు. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌ర‌ద న‌ష్టానికి సంబంధించి వివ‌రాలు పంప‌లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

వెంట‌నే యుద్ధ ప్రాతిప‌దిక‌న వ‌ర‌ద న‌ష్టం వివ‌రాలు పంపించాల‌ని ఆదేశించింది. రూ. 1345 కోట్ల ఎస్డీఆర్ఎఫ్ నిధులు తెలంగాణ ప్ర‌భుత్వం వ‌ద్ద అందుబాటులో ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేసింది.

అటు ఏపీకి ఇటు తెలంగాణ రాష్ట్రానికి వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల‌లో బాధితుల‌ను ఆదుకునేందుకు గాను 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాల‌ను పంపించ‌డం జ‌రిగింద‌ని తెలిపింది కేంద్ర హోం శాఖ‌.

అంతే కాకుండా రెండు హెలికాప్ట‌ర్ల‌ను కూడా పంపించామ‌ని స్ప‌ష్టం చేసింది. ఇదిలా ఉండ‌గా గ‌త జూన్ నెల‌కు సంబంధించి రూ. 208 కోట్ల విడుద‌లకు గాను ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి వ‌నిత రాలేద‌ని, ఇది త‌మ‌ను విస్తు పోయేలా చేసింద‌ని కేంద్ర హోం శాఖ పేర్కొంది.