యశోద హాస్పిటల్స్ రూ. కోటి విరాళం
భట్టి విక్రమార్కకు చెక్కు అందజేత
హైదరాబాద్ – గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ రోగులను పీల్చి పిప్పి చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ బుధవారం తెలంగాణ లో వరద బాధితుల సహాయం కోసం విరాళం ప్రకటించింది. ఈ మేరకు హాస్పిటల్స్ తరపున రూ. కోటి చెక్కును డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు అందజేసింది.
ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తాయి. భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం చోటు చేసుకుంది. ఈ సందర్బంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సినీ రంగానికి చెందిన నటీ నటులు, దర్శకులు, నిర్మాతలు, సినీ టెక్నీషియన్స్ , కంపెనీలు ఉదారతను చాటుకున్నాయి.
ఏపీ డిప్యూటీ సీఎం తెలంగాణ సీఎం నిధికి రూ. కోటి ఇస్తున్నట్లు ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి రూ. 50 లక్షలు , బాలకృష్ణ రూ. 50 లక్షలు, మహేష్ బాబు రూ. 50 లక్షలు, రామ్ చరణ్ రూ. 50 లక్షలు తమ వంతుగా విరాళంగా ప్రకటించారు. వీరితో పాటు జూనియర్ ఎన్టీఆర్ రూ. 50 లక్షలు ప్రకటించారు తెలంగాణ సీఎం నిధికి.
వీరితో పాటు విశ్వక్ సేన్ , జొన్నలగడ్డ సిద్దూ, అనన్య నాగళ్ల తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా విరాళం ప్రకటించారు.