వరద బాధితులకు ఆపన్న హస్తం
దగ్గరుండి పర్యవేక్షిస్తున్న సీఎం
అమరావతి – వర్షాల తాకిడికి ఆంధ్రప్రదేశ్ తల్లడిల్లుతోంది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్షాభావ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ..పర్యవేక్షిస్తున్నారు.
మంత్రులు, ఉన్నతాధికారులను సమన్వయం చేస్తూ చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా వరద బాధితులకు అండగా ఉండేందుకు గాను ఆహారం, వాటర్ ప్యాకెట్లను, పండ్లను సరఫరా చేసేలా కృషి చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఫుడ్ స్టాక్ పాయింట్ గా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం. వరద ప్రభావిత ప్రాంతాల బాధితులకు ఐజిఎంసి స్టేడియం వాహనాల ద్వారా సరఫరా చేస్తున్నారు. చిట్ట చివరి ప్రాంతంలోని చివరి వ్యక్తి వరకు ఆహారం అందించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
10 లక్షల ఆహార ప్యాకెట్లు , నాలుగున్నర లక్ష లకుపైగా మిల్క్ ప్యాకెట్లు, 10 లక్షల వాటర్ బాటిల్స్ 25 వేలకు పైగా బిస్కెట్లతో పాటు అరటి, బత్తాయి వంటి పండ్లు పంపిణీ చేశారు.
చంద్రబాబు నాయుడు గారి అదేశాల మేరకు విజయవాడ ఎంజీ రోడ్ లోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం నుండి వరద ప్రభావిత ప్రాంతాల బాధితులకు ఆహార పంపిణీ జరుగుతుంది.