ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజలకు శాపం
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి
విజయవాడ – ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. బాధితులను పరామర్శించారు మాజీ సీఎం. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
కేంద్ర వాతావరణ శాఖతో పాటు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ముందు జాగ్రత్తగా రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని హెచ్చరించిందని అయినా సీఎం చంద్రబాబు నాయుడు స్పందించ లేదని ఆరోపించారు.
అంతకు ముందు బెజవాడ లోని పాత రాజ రాజేశ్వరి పేటలో వరద బాధితులను పరామర్శించారు. వారికి తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
తమ ప్రభుత్వ హయాంలో వరదలు వస్తే ముప్పావు శాతం మందికిపైగా బాధితులు పునరావాస కేంద్రాల్లో ఉండే వారని గుర్తు చేశారు. వరదలు రాకముందే కలెక్టర్ల నుంచి వాలంటీర్ల వరకు అందరూ అప్రమత్తమై..బాధితులకి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ సాయం చేసే వారని చెప్పారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
తాము ఎప్పుడూ ఇలా చంద్రబాబు నాయుడు లాగా అర్ధరాత్రి వచ్చి ఆర్భాటం చేయడం లేదని, ప్రచారం కోసం పాకులాడటం లేదని ధ్వజమెత్తారు. ఇంత మందిని పొట్టన పెట్టుకున్న నువ్వు సీఎం పదవిలో ఉండేందుకు అర్హుడువి కావంటూ మండిపడ్డారు.