NEWSTELANGANA

రేవంత్ రెడ్డి నిర్వాకం ఆర్ఎస్పీ ఆగ్ర‌హం

Share it with your family & friends

6200 మందిని తీసి వేయ‌డంపై ఫైర్

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డిపై సీరియ‌స్ కామెంట్స్ చేశారు. గురువారం ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఇవాళ ఉపాధ్యాయ దినోత్స‌వం సంద‌ర్బంగా సీఎం తీసుకున్న నిర్ణ‌యం దారుణ‌మ‌ని వాపోయారు.

రాత్రికి రాత్రే 2000 పైగా గురుకుల టీచర్ల కుటుంబాలను అకారణంగా రోడ్డున పడేశార‌ని మండిప‌డ్డారు. గురుకుల రిక్రూట్ మెంట్ లో మూడు వేల బ్యాక్ లాగ్ పోస్టులు అకారణంగా ఉత్పన్నం అయ్యేవి కావ‌ని పేర్కొన్నారు ఆర్ఎస్పీ.

నాలుగున్నర లక్షల మంది ప్రైవేటు టీచర్లను మీరు ఎల్బీ స్టేడియంలో పబ్లిక్ గా అవమానించే వారు కాద‌న్నారు. మెగా డీయస్సీ పేరుతో ఇంత దగా జరిగి ఉండేది కాదంటూ ఎద్దేవా చేశారు.

ఇప్పటికే విశ్వ విద్యాలయాల్లో వీసీల నియామకం చేప‌ట్ట లేద‌ని, విద్యా రంగాన్ని పూర్తిగా నిర్ల‌క్ష్యం చేశార‌ని ఆరోపించారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్.

టీచర్లు లేక వందల స్కూళ్లు మూత ప‌డ్డాయ‌ని, ఎంఈవోలు లేక పోవ‌డం పూర్తిగా నియంత్ర‌ణ త‌ప్పింద‌న్నారు. ప్ర‌భుత్వం ఏర్ప‌డి 9 నెల‌లు కావస్తున్నా ఇప్ప‌టి వ‌ర‌కు విద్యా శాఖ‌కు మంత్రి లేక పోవ‌డం ప‌ట్ల ఫైర్ అయ్యారు.

విద్యార్థులు ఆహారం కోసం, క‌నీస సౌక‌ర్యాల కోసం రోడ్ల మీద‌కు వ‌స్తున్నార‌ని అయినా సీఎం రేవంత్ రెడ్డి న‌టిస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.