బాధితులకు హోం మంత్రి భరోసా
వరద ప్రభావిత ప్రాంతాలలో అనిత
విజయవాడ – వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రులు పెద్ద ఎత్తున సహాయక కార్యక్రమాలలో పాల్గొన్నారు. రేయింబవళ్లు శ్రమిస్తున్నారు బాధితులను ఆదుకునేందుకు .
తాజాగా విజయవాడ లోని భవానీపురం, స్వాతి సెంటర్ పరిసర ప్రాంతాల్లో ఎంపీ కేశినేని శివనాథ్ , పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుతో కలిసి పర్యటించారు ఏపీ మంత్రి వంగలపూడి అనిత.
వరద తగ్గడంతో పారిశుధ్య పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. వాటర్ ట్యాంకర్లతో రోడ్లు షాపులు ఇళ్లు శుభ్రం చేయించే పనులు పర్యవేక్షించారు ఏపీ మంత్రి.
యుద్ధ ప్రతిపాదికన పనులు పూర్తి చెయ్యాలని ఆదేశించారు వంగలపూడి అనిత. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను విన్నారు. తమ ప్రభుత్వం బాధితులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పారు.
తమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పెద్ద ఎత్తున సహాయక పనులలో నిమగ్నం కావడం జరిగిందని స్పష్టం చేశారు వంగలపూడి అనిత.