తళపతి విజయ్ ఫ్యాన్స్ కు పండుగ
తమిళనాడు అంతటా సంబురాలు
హైదరాబాద్ – వెంకట్ ప్రభు దర్శకత్వంలో తళపతి విజయ్, మీనాక్షి చౌదరి, స్నేహ తదితరులు నటించిన ది గోట్ గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాకు పెద్ద ఎత్తున అభిమానులు పోటెత్తారు.
తమ అభిమాన నటుడు, ఆరాధ్య దైవంగా భావించే తళపతి విజయ్ ను చూసేందుకు టాకీసుల ముందు బారులు తీరారు. విజయ్ ఈసారి ది గోట్ సినిమాలో భిన్నమైన పాత్రలను పోషించాడు. ఇందులో డ్యూయల్ రోల్ లో నటించడం విశేషం.
ఇక వెంకట్ ప్రభు ఏ మేరకు సక్సెస్ అయ్యాడనేది కొద్ది రోజులు ఆగితే కానీ చెప్పలేం. ది గోట్ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చాడు.
తండ్రీ కొడుకులుగా విజయ్ ఇరగదీశాడని చెప్పక తప్పదు. ఏ పాత్ర ఇచ్చినా అందుకు అనుగుణంగా నటించడం విజయ్ కి వెన్నతో పెట్టిన విద్య.
ఇక ఎవరూ ఊహించని రీతిలో భారీ ఎత్తున రెమ్యూనరేషన్ విజయ్ తీసుకున్నట్లు సినీ పరిశ్రమలో టాక్. ది గోట్ లో నటించినందుకు ఏ నటుడు తీసుకోని విధంగా ఇచ్చినట్లు సమాచారం.