తళుక్కున మెరిసిన తళపతి విజయ్
ది గోట్ మూవీకి అంతటా బ్రహ్మరథం
హైదరాబాద్ – ఎట్టకేలకు భారీ అంచనాల మధ్య తమిళ సినీ నటుడు తలపతి విజయ్ నటించిన ది గోట్ విడుదలైంది. తమిళం, తెలుగు, హిందీ భాషలలో ది గోట్ ను విడుదల చేశారు . నిన్నటి నుంచే భారీ ఎత్తున సినిమాను చూసేందుకు, తమ అభిమాన నటుడిని వీక్షించేందుకు బారులు తీరారు తళపతి అభిమానులు. ఒక రకంగా చెప్పాలంటే వినాయక చవితి కంటే ముందే వచ్చిన ఈ చిత్రం విజయ్ ఫ్యాన్స్ కు కనువిందు చేసేలా తీర్చి దిద్దడంలో సక్సెస్ అయ్యాడు.
ఒక రకంగా చెప్పాలంటే ది గోట్ మూవీ మొత్తం అన్నీ తానై వ్యవహరించాడు..కీలక పాత్ర పోషించాడు తళపతి విజయ్. తనకు స్పెషల్ ఇమేజ్ ఉంది. ఏ పాత్ర ఇచ్చినా అందులో లీనమై పోయి నటించడం తనకు ముందు నుంచి అలవాటు.
ఈ మధ్యనే రాజకీయ పార్టీ కూడా పెట్టడం, ప్రకటించిన తర్వాత తొలిసారిగా విడుదలైన చిత్రం ది గోట్. ఇక వెంకట్ ప్రభు దర్శకత్వ పరంగా ఎక్కడా తగ్గకుండా విజయ్ ను మరింత వాడుకునే ప్రయత్నం చేశాడు. ది గోట్ లో డ్యూయల్ రోల్. ఆకట్టుకునే డైలాగులతో పాటు తళపతి విజయ్ నటన సినిమాకు హైలెట్ అవుతుందని చెప్పక తప్పదు.