ENTERTAINMENT

విజ‌య్ అదుర్స్ ఫ్యాన్స్ ఖుష్

Share it with your family & friends

త‌ళ‌ప‌తి విజ‌య్ నా మ‌జాకా

హైద‌రాబాద్ – త‌మిళ‌నాట అత్యంత జ‌నాద‌ర‌ణ క‌లిగిన అరుదైన న‌టుడు విజ‌య్ జోసెఫ్‌. కోట్లాది మంది అభిమానులు ప్రేమ‌గా పెట్టుకున్న పేరు త‌ళ‌ప‌తి. అంటే అర్థం ద‌ళ‌ప‌తి అని. ఇప్ప‌టికే పార్టీ ప్ర‌క‌టించి సంచ‌ల‌నంగా మారాడు విజ‌య్.

త‌ను ఇంట్రావ‌ర్ట్. అంతే కాదు న‌టించ‌డంలో త‌న‌కు త‌నే సాటి. ఒక్కో న‌టుడిది ఒక్కో స్టైల్. అట్లీ తీసిన మెర్సిల్ సూప‌ర్ స‌క్సెస్. ఒక ర‌కంగా చెప్పాలంటే ద‌ర్శ‌కుల‌కు ఇష్ట‌మైన న‌టుడు త‌ళ‌ప‌తి విజ‌య్. ప్ర‌స్తుతం వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తాజా చిత్రం ది గోట్ అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా విడుద‌లైంది.

సీక్రెట్ ఆప‌రేష‌న్స్ నిర్వ‌హించే పాత్ర‌లో ఒదిగి పోయాడు త‌ళ‌ప‌తి విజ‌య్. త‌న‌కు ఏ పాత్ర ఇచ్చినా దానికి వంద శాతం న్యాయం చేసే ద‌మ్మున్న యాక్ట‌ర్ . ది గోట్ సినిమాలో రెండు పాత్ర‌ల‌లో న‌టించాడు త‌ళ‌ప‌తి. ఇక అభిమానులు ఈల‌లు కేరింత‌లు వేస్తున్నారు.

న‌ట‌నా ప‌రంగా టాప్ మార్కులు తెచ్చుకున్న విజ‌య్ తో మీనాక్షి చౌద‌రి కూడా అంతే స్థాయిలో ప్ర‌ద‌ర్శించింది. మొత్తంగా ది గోట్ చిత్రం గురించి కొంద‌రు యావ‌రేజ్ ఉందంటూ పేర్కొన్నా…విజ‌య్ ఫ్యాన్స్ మాత్రం సంబురాల‌లో మునిగి పోయారు.