వెంకట్ ప్రభు మార్క్ విజయ్ స్పార్క్
అంచనాలకు మించి ది గోట్ మూవీ
హైదరాబాద్ – భారీ అంచనాల మధ్య విడుదలైంది వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ది గోట్ మూవీ. ప్రపంచ వ్యాప్తంగా ఆదరణను చూరగొంటోంది. కథ, కథనం, యాక్షన్స్ , రొమాన్స్, థ్రిల్లర్ నేపథ్యంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.
ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ది గోట్ ను నిర్మించారు. భారీ ఖర్చుతో సినిమాను తీశారు. ఏకంగా ఇందులో నటించినందుకు గాను నటుడు తళపతి విజయ్ కు ఏకంగా రూ. 200 కోట్లు పారితోషకంగా ఇచ్చినట్లు టాక్.
ఇది పక్కన పెడితే భారీ తారాగణం ది గోట్ చిత్రంలో నటించింది. ఎవరి పాత్రలలో వారు లీనమై నటించినా మొత్తంగా సినిమా అంతా విజయ్ కనిపిస్తాడు. ఇందులో డ్యూయల్ రోల్ పోషించాడు . ఇదే ఈ సినిమాకు హైలెట్ అని చెప్పవచ్చు.
ది గోట్ మూవీలో విజయ్ తో పాటు ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్ అమీర్, మోహన్, జయరామ్, స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి, వైభవ్, యోగి బాబు, ప్రేమి అమరేన్ , యుగేంద్రన్ తదితరులు నటించారు.
విజయ్ రాజకీయ ప్రవేశానికి ముందు ఇది చివరి చిత్రంగా పేర్కొంటున్నారు. ఉగ్రవాద వ్యతిరేక స్క్వాడ్ నేపథ్యంగా ది గోట్ చిత్రాన్ని తీశాడు దర్శకుడు వెంకట్ ప్రభు.