ఆదిమూలం సరసం సంచలనం
పార్టీ నుంచి సస్పెండ్ చేసిన చీఫ్
అమరావతి – తెలుగుదేశం పార్టీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు బిగ్ షాక్ తగిలింది. ఓ వైపు వర్షాలతో, వరదలతో ఏపీ అతలాకుతలం అవుతుంటే, ప్రజల మధ్యన ఉండాల్సిన ఎమ్మెల్యే సరసాలలో చెలరేగి పోవడం విస్తు పోయేలా చేసింది.
సదరు ఎమ్మెల్యేకు సంబంధించిన సెక్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ప్రస్తుతం ట్విట్టర్ ఎక్స్ వేదికగా ట్రెండింగ్ లో కొనసాగుతోంది. దీంతో గత ఎన్నికల్లో వైసీపీ నుంచి టీడీపీలో చేరి..టికెట్ పై ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఆదిమూలం సరసంలో తాను తీసి పోనంటూ బహిరంగంగా బయట పడడం విస్తు పోయేలా చేసింది. దీంతో తమ పార్టీకి మచ్చ తీసుకు వచ్చేలా చేసినందుకు గాను సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు తెలుగుదేశం పార్టీ ఏపీ చీఫ్ శ్రీనివాస రావు.
.
ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయని, అందుకే చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. దీంతో ఆదిమూలం ఎమ్మెల్యేగా ఉంటారా లేక రాజీనామా చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. మొత్తంగా ఎమ్మెల్యేగా కంటే సెక్స్ విషయంలో టాప్ లో ఉన్నట్టు అనిపిస్తోంది.