NEWSANDHRA PRADESH

వ‌ర‌ద బాధితుల‌కు అల్తాఫ్ బాబా సాయం

Share it with your family & friends

కుల మ‌తాల‌కు అతీతంగా అన్న‌దానం

అమ‌రావ‌తి – వ‌ర‌ద‌ల దెబ్బ‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం అత‌లాకుత‌లమైంది. భారీ ఎత్తున ప్రాణ‌, ఆస్తి న‌ష్టం చోటు చేసుకుంది. చాలా ప్రాంతాలు ఇప్ప‌టికీ ఇంకా నీళ్ల‌ల్లోనే ఉన్నాయి. బాధితులు బావురుమంటున్నారు. దిక్కుతోచ‌ని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ స‌మ‌యంలో కొంద‌రు స్వ‌చ్ఛంధంగా ముందుకు వ‌చ్చి బాధితులు, అన్నార్థులు, పేద‌ల‌కు సాయం చేస్తున్నారు. త‌మ‌కు ఉన్న‌దాంట్లో కొంత మొత్తాన్ని వారి ఆక‌లిని తీర్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

సాయం చేసేందుకు కుల‌, మ‌తాల‌తో ప‌ని లేద‌ని నిరూపించారు కొండ‌ప‌ల్లిలోని శాంతి న‌గ‌ర్ కు చెందిన అల్తాఫ్ బాబా. ముంపులో చిక్కుకు పోయింది కొండ‌ప‌ల్లి, దాని ప‌రిస‌ర ప్రాంతాలు. అల్తాఫ్ బాబా ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున అన్న‌దాన కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు.

విష‌యం తెలుసుకున్న ఏపీ హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అన‌తి అల్తాఫ్ బాబా చేస్తున్న మంచి కార్య‌క్ర‌మాన్ని ప్ర‌శంస‌లు కురిపంచారు. తానే స్వ‌యంగా అన్నార్థుల‌కు అన్న‌దానం చేశారు. స్వ‌యంగా వ‌డ్డించారు.

వరద బాధితులకు స్వచ్ఛందంగా అన్నదానం, సహకారం అందిస్తున్న అల్తాఫ్ బాబా లాంటి వారి సేవలు అభినందనీయమని ప్ర‌శంసించారు వంగ‌ల‌పూడి అనిత‌. ప్రభుత్వం వరద బాధితుల కోసం తెరచిన ‘సీఎంఆర్ఎఫ్’ బ్యాంకు ఖాతాలకు విరాళాలు అందించాల‌ని కోరారు.