NEWSANDHRA PRADESH

జ‌గ‌న్ రెడ్డి నిర్వాకం బుడ‌మేరుకు శాపం

Share it with your family & friends

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి దేవినేని ఉమ

విజ‌య‌వాడ – ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర్ రావు సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఆనాడు బుడ‌మేరుకు చంద్ర‌బాబు నాయుడు డ‌బ్బులు కేటాయించినా జ‌గ‌న్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో ప‌ట్టించు కోలేద‌ని ఆరోపించారు. గురువారం దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర్ రావు మీడియాతో మాట్లాడారు.

వైసీపీ నేతల మట్టి దోపిడీ కార‌ణంగానే బుడమేరుకు గండ్లు పడ్డాయ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.
జగన్ తెలివి తక్కువ నిర్ణయాల ఫలితమే బెజవాడ వాసుల కన్నీటి వ్యథకు కారణమైంద‌ని మండిప‌డ్డారు.

ఐదు నిమిషాలు పరామర్శకు వచ్చి విష ప్రచారం చేస్తున్నారం చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ప్రకాశం బ్యారేజ్ కు గీజు పెట్టేందుకు కూడా జగన్ ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆరోపించారు దేవినేని ఉమ‌.

కష్టాల్లో ఉన్న ప్రజల కోసం అర్థరాత్రి అపరాత్రి అని కూడా చూడకుండా చంద్ర‌బాబు నాయుడు శ్ర‌మిస్తున్నార‌ని తెలిపారు. ఆనాడు కచ్చులూరు బోటు ప్రమాదంలో 55 మంది చనిపోతే హెలికాఫ్టర్ లో ఏరియల్ సర్వే చేసిన జగన్ నేడు విషం చిమ్మడం సిగ్గు చేటు అన్నారు.

ప్రకాశం బ్యారేజ్ కు ఎన్నడూ లేని విధంగా వరద పోటెత్తిందన్నారు. దాంతో స్వయంగా సీఎం చంద్రబాబే రంగంలోకి దిగారని చెప్పారు. వరద బాధితులకోసం యంత్రాంగాన్ని పరిగెత్తించారని, బాధితులకు ధైర్యం చెప్పారని అన్నారు దేవినేని ఉమ‌.