NEWSTELANGANA

ఆదివాసీ మ‌హిళ‌పై అత్యాచారం దారుణం

Share it with your family & friends

బీజేపీ మ‌హిళా మోర్చా అధ్య‌క్షురాలు

హైద‌రాబాద్ – భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌హిళా మోర్చా రాష్ట్ర అధ్య‌క్షురాలు శిల్పా రెడ్డి సీరియ‌స్ కామెంట్స్ చేశారు. గురువారం ఆమె పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పాల‌న గాడి త‌ప్పింద‌న్నారు. బాలిక‌లు, మహిళ‌లు, యువ‌తుల‌కు తెలంగాణలో ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఆసిఫాబాద్ లో ఆదివాసీ మహిళపై హత్యాచారానికి ఒడిగట్టిన రాక్షసుడు మఖ్దూమ్ ను వెంటనే ఉరి తీయాలని డాక్ట‌ర్ శిల్పా రెడ్డి డిమాండ్ చేశారు. బాధితురాలి వైపు నిలబడాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దారుణ ఘటనను దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు.

గిరిజన ఆడబిడ్డలకు అండగా బిజెపి మహిళా మోర్చా ఉందని స్ప‌ష్టం చేశారు. బాధితురాలికి న్యాయం జరగేదాకా తమ పోరాటం ఆగదని హెచ్చ‌రించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతాం అని పేర్కొన్నారు బిజెపి తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు.